కేటీఆర్ నీకు క్లారిటీ ఏదీ..? 48 గంటల్లో ఏదో చేస్తా అన్నావు కదా ఏమైంది..?

by Bhoopathi Nagaiah |

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ నీకు క్లారిటీ ఏదీ..? 48 గంటల్లో ఏదో చేస్తా అన్నావు కదా ఏమైంది..?
X

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల చీకటి కోణాన్ని 48 గంటల్లో బయట పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అన్నావ్.. చివరికి క్లారిటీ లేకుండా మాట్లాడవేం కేటీఆర్ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. హైడ్రోజన్ బాంబు వేస్తానన్న కేటీఆర్.. ఎంత పెద్ద చప్పుడు అవుతుందో.. ఎన్ని ప్రాణాలు పోతాయో.. దేశం అల్లకల్లోలం అయిపోతుందని అనుకున్నాం.. చివరికి ఉల్లిగడ్డ బాంబ్ కూడా వేయకుండా వెళ్లిపోయావ్.. అని సెటైర్లు వేశారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ లింక్‌లో చూడండి.

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఆ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడైనా రైతులకు ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్న బియ్యం అంశంపై జూమ్ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక అంశాలు ప్రస్తావించారు. అవేంటో ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.

వనరులున్నా ఉద్యమాలతో జిల్లా అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, ఏదైనా ప్రాజెక్టు చేపడతామంటే జెండాలు తీసుకుని వచ్చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. సొంత జిల్లా శ్రీకాకుళం అభివృద్ధి చెందకపోవడంపై ఆయన ఇవాళ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు ఎవరిని, ఏమన్నాడో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి,

ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముగ్గురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టారు. స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీచర్ చెప్పుతో కొట్టారు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే వారు పాఠశాలకు చేరుకుని టీచర్‌ను నిలదీశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.

Next Story