మీరు తప్పులు చేసి మాపై నిందలా.. బీఆర్ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-14 07:39:57  IST  )

పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) తప్పుమీద తప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బుదరజల్లెందుకు ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఆరోపించారు.

మీరు తప్పులు చేసి మాపై నిందలా.. బీఆర్ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) తప్పుమీద తప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బుదరజల్లెందుకు ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఆరోపించారు. ఇవాళ ఖమ్మం (Khammam) జిల్లాలోని పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)తో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే.. వ్యవసాయం, కరెంట్, ప్రాజెక్టులు అని అన్నారు. పదేళ్ల అధికారంలోఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయెజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్ (KCR) పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఆనాడు తప్పిదాలు చేసిందే కేసీఆర్, కేటీఆర్ హరీశ్ రావులు అంటూ మండిపడ్డారు. నేడు మళ్లీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సాగర్ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని.. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. ఇక నుంచి ప్రతి సీజన్‌కు ముందు రైతుభరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తామని.. ఆలస్యం చేయబోమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Next Story