ఆ విషయంలో ఎవరు గొప్ప మీరే చెప్పాలి.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సూటి ప్రశ్న

by Ramesh Goud |

తెలంగాణలో ప్రశాంతతకు కారణం కాంగ్రెస్ అని, పదేళ్లలో లేని స్వేచ్ఛను ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (TPCC Working President Jaggareddy) అన్నారు.

ఆ విషయంలో ఎవరు గొప్ప మీరే చెప్పాలి.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సూటి ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రశాంతతకు కారణం కాంగ్రెస్ అని, పదేళ్లలో లేని స్వేచ్ఛను ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (TPCC Working President Jaggareddy) అన్నారు. గాంధీ భవన్ (Gandhi bhavan)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నారని, ఈ ప్రశాంతతకు కారణం ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్‌ను తెచ్చుకోవడమేనని స్పష్టం చేశారు.

గత పదేళ్లలో ప్రజలు నోరు విప్పే స్వతంత్రం కూడా లేదని, కానీ ఇప్పుడు మాకు ఈ బాధ ఉంది అని చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కల్పించిందని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ నేత కేసీఆర్ (BRS President KCR) కు తాము స్వతంత్రం ఇచ్చామని, కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన స్వతంత్రం వల్లే కేసీఆర్ సభ (KCR Meeting) సక్సెస్ అయిందని అన్నారు. మీ పదేళ్ల పరిపాలనలో ప్రతిపక్షాలకు సభలు పెట్టుకునే అవకాశామే ఇవ్వలేదని, పోలీసులను పెట్టి మా నాయకులను నిర్భందాలకు గురి చేశారని మండిపడ్డారు.

ఇక రైతులకు రూ.500 బోనస్ గురించి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. రైతుకు 5 ఎకరాలుంటే 75 వేలు వస్తున్నాయని, ప్రభుత్వం ఇచ్చే రూ.500 తో రైతుకు 50 వేలు ఎక్స్‌ట్రా వస్తుందని తెలిపారు. 5 ఎకరాలు ఉన్న రైతుకు బోనస్‌తో కలిపి 75 వేలు వస్తుందంటే హ్యాపీయే కదా అని వ్యాఖ్యానించారు. అంతేగాక రైతు రుణమాఫీ విషయంలో ఎవరు శభాష్ అనేది ప్రజలే చెబుతారని. పదేళ్లలో రూ. 20 వేల కోట్లు రుణమాఫీ గొప్పనా.. ఒకటే సంవత్సరంలో రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేయడం గొప్పా చెప్పాలని కాంగ్రెస్ నేత అన్నారు.

Next Story