- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ, అమిత్ షాలపై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.. బీజేపీ నేత రామచంద్రరావు ఫైర్
కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోదీ, అమిత్ ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ముందు మీ నాయకులు జైలుకు పోకుండా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత ఎన్. రామచంద్రరావు (BJP Leader N.Ramachandra Rao) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోదీ, అమిత్ ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ముందు మీ నాయకులు జైలుకు పోకుండా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత ఎన్. రామచంద్రరావు (BJP Leader N.Ramachandra Rao) అన్నారు. ఈడీ కార్యాలయం వద్ద జరిపిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు (Congress leaders) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ.. బోఫోర్స్ కుంభకోణం (Boforce Scam) మొదలు ఎన్నో స్కాముల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కొన్ని లక్షల కోట్లు దోచుకున్నదని అన్నారు.
స్కామ్‌స్టర్ల పార్టీ కాంగ్రెస్ అని, నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో పాట్నా, లక్నో, ఢిల్లీ, ముంబైలలో కొన్ని వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) మింగేశారని ఆరోపించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీని అప్రతిష్ఠ పాలు చేయాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారని, దేశ సంపదను లూటీ చేసిన మీకు ఆందోళనలు చేసే హక్కు లేదని మండిపడ్డారు. దేశ సంపదను దోచుకున్నందుకే ఈడీ కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేసిందని, ఈడీ సాక్ష్యాలతో ముద్దాయిలుగా తేలారని, జైలుకు వెళ్లి బెయిల్ కూడా తీసుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్ వాళ్ల బతుకులు, చరిత్ర దేశం చూసింది కాబట్టే దేశమంతా కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకుంటోందని అన్నారు. నిరసనల సందర్భంగా బీజేపీ నేతలపై కాంగ్రెస్ నాయకులు వాడే భాషను ఆయన ఖండించారు. టీవీ ఛానళ్లలో పాకిస్థాన్ జిందాబాద్ అన్న వ్యక్తి, పాకిస్థాన్ అంటే నాకిష్టం అన్న వ్యక్తి ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah) లపై నోరు పారేసుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మీ నాయకులు జైలుకు పోకుండా చూసుకోవాలని, మూడు సార్లు ప్రజలు పక్కన పార్టీ మీదని, మీరు బీజేపీ నేతలపై మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. మీ నాయకులు దొంగలు, అవినీతి పరులు, దేశాన్ని దోచుకున్న వారని, వారికి మద్దతు ఇస్తున్న మీకు మోడీ, అమిత్ షాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ ఎమ్మెల్సీ (Former MLC) వ్యాఖ్యానించారు.






