- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెయ్యి మంది యువతతో అక్కడి నుంచే పాదయాత్ర.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: మీకు ఉద్యోగాలు వచ్చాయి కానీ నిరుద్యోగులకు ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS leader Harish Rao) ప్రశ్నించారు. యువ, విద్యార్థి సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jublee Celebrations Meeting)ను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. గులాబీ జెండాకు గుండె గులాబీలు, యువ విద్యార్థులేనని అన్నారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అని, ఆరు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చెయ్యకుండా 55 వేల ఉద్యోగాలు భర్తీ అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
2లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగ యువతను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అంటూ.. కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపి నిరుద్యోగులను వాడుకొని వదిలిపెట్టారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు అయిపోయాక కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గుండెల మీద తన్నుతున్నది అని, ఓడ దాటే దాకా ఓడ మలన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ తీరు అని దుయ్యబట్టారు. ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం (Pro. Kodandaram), రియాజ్ (Riyaz), బాల్మూరి వెంకట్ (Balmoor Venkat), మురళి (Mural), రేవంత్ రెడ్డి (Revanth Reddy) అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరిగారు.. బస్సు యాత్రలు చేశారని గుర్తు చేశారు.
అంతేగాక రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని అశోక్ నగర్ (Ashok Nagar) కు తీసుకొచ్చి ప్రామిస్ లు చేయించారని, వారికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి.. నిరుద్యోగులకు రాలేదని, ఈ రోజు ఎందుకు మీ గొంతులు మూగబోయాయి అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, 15 నెలలు పూర్తి అయినా ఎందుకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదని అడిగారు. రాహుల్ గాంధీకి నిరుద్యోగుల బాధలు కనపడడం లేదా వినపడడం లేదా? నిరుద్యోగ భృతి ఉట్టి మాటే అయ్యిందా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీ కి యువత కీలకమని, సిద్దిపేట (Siddipeta) నుండి పార్టీ రజతోత్సవ సభకు వెయ్యి మంది యువత, విద్యార్థులతో పాదయాత్ర చేస్తామని అన్నారు. సిద్దిపేట నుండి చేసే పాదయాత్ర సిద్దిపేట 25ఏళ్ల గులాబీ జెండాకు స్ఫూర్తి అని బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే వ్యాఖ్యానించారు.






