- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli : విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ టీవీల్లో చూడోచ్చు!
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)దేశవాళీ రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్ ల్లో 13 ఏళ్ల తర్వాత తిరిగి ఆడబోతుండటం క్రీడాభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli )దేశవాళీ రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్ ల్లో 13 ఏళ్ల తర్వాత తిరిగి ఆడబోతుండటం క్రీడాభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఢిల్లీ-రైల్వేస్ రంజీ మ్యాచ్(Delhi-Railways Match)లో విరాట్ ఢిల్లీ జట్టు తరుపున బరిలోకి దిగబోతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ(BCCI) విరాట్ అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. విరాట్ కోహ్లీ ఆడనున్న ఈ రంజీ ట్రోఫీ చివరి రౌండ్ ఢిల్లీ-రైల్వేస్ రంజీ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం(Live Broadcast) చేయనున్నట్లుగా బీసీసీఐ వెల్లడించింది. జియో సినిమా ఓటీటీలో ఢిల్లీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో విరాట్ కోహ్లి ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన వారికి ఇది శుభవార్త అని..హాయిగా ఇంట్లో కూర్చొని మ్యాచ్ వీక్షించవచ్చని బీసీసీఐ పేర్కోంది.
నిజానికి రోస్టర్ విధానంలో మూడు మ్యాచ్ లను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశముండగా..వాటిల్లో విరాట్ ఆడే ఢిల్లీ - రైల్వేస్ రంజీ మ్యాచ్ లేదు. బీసీసీఐ చివరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకొని విరాట్ కోహ్లీ మ్యాచ్ లైవ్ కు అవకాశం కల్పించింది. ఇది విరాట్ ఆట పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పవచ్చంటున్నారు క్రీడా విశ్లేషకులు.
విరాట్ కోహ్లీ ఆడనున్న ఢిల్లీ రైల్వేస్ మ్యాచ్ తో పాటు మరో భారత స్టార్ ఆటగాడు, కర్ణాటకకు చెందిన కేఎల్.రాహుల్ ఆడబోతున్న కర్ణాటక వర్సెస్ హర్యానా మ్యాచ్ ను, పంజాబ్ వర్సెస్ బెంగాల్, బరోడా వర్సెస్ జమ్మూకశ్మీర్ మ్యాచ్ లను బీసీసీఐ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
విరాట్ ముమ్మర ప్రాక్టీస్
రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ రంజీ మ్యాచ్ లో ఢిల్లీ తరుపున బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో రాణించేందుకు ఇప్పటికే ఢిల్లీ జట్టుతో కలిసి ముమ్మరంగా సాధనలో మునిగాడు. ప్రాక్టీస్ కూడా చేసేస్తున్నాడు. స్టేడియానికి తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన తన చిన్ననాటి మిత్రుడు షావెజ్, అతని కుమారుడు కబీర్ తో ముచ్చటించాడు. టీమిండియాకు ఆడాలంటే ఏం చేయాలన్న కబీర్ ప్రశ్నకు విరాట్ కోహ్లీ బదులిస్తూ ఉదయాన్నే లేచి రోజు సాధన చేయాలని..మీ నాన్నకు కూడా నీవెంతగా సాధన చేస్తున్నావో చెప్పవద్ధని..అందరు గంట సాధన చేస్తే నీవు రెండు గంటలు సాధన చేయాలని సూచించడం అందరిని ఆకట్టుకుంది.






