- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాటుకు సంసారం చేసేది మీరు.. కేటీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్
సాటు సంసారం చేసే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సాటు సంసారం చేసే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని అన్నారు. గత పదేళ్లలో పాలన ఫామ్‌హౌస్ కొనసాగిందని మండిపడ్డారు. ఇన్నాళ్లకు రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని సెటైర్లు వేశారు. ప్రస్తుతం మాపై ప్రజలు పెట్టిన బాధ్యతలను తీర్చే పనిలో ఉన్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా బీఆర్ఎస్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. ఢిల్లీకి పనిలేక కాదని రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులప పురోగతికేనని అన్నారు. కేసీఆర్ ఉన్నంత వరకే కేటీఆర్, హరీష్రావులకు ఉనికే లేదని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డితో ముఖాముఖి తలపడాలంటే కేసీఆర్‌కు భయమేస్తోందని.. అందుకే అసెంబ్లీకి కూడా రావడం మానేశాడని ధ్వజమెత్తారు.
మాటిమాటికి సీఎం రేవంత్ రెడ్డి ‘జై తెలంగాణ’ అనడం లేదంటూ కామెంట్ చేస్తున్నారని, అసలు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఆ పదాన్ని తీసివేసిన ఘటన మీది కాదా అని ఎద్దేవా చేశారు. ఇక రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువని కేటీఆర్, హరీష్లు కామెంట్ చేస్తున్నారని.. అసలు కేసీఆర్, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పనిచేయలేదా అని ప్రశ్నించారు. రేవంత్ కంటే ముందే కేసీఆర్ టీడీపీలో ఉన్నాడు.. మరి దానికేమనాలని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇద్దరు లీడర్లు బండి సంజయ్, కేటీఆర్ పొరపాటున లీడర్లు అయ్యారని అన్నారు. కేటీఆర్, లోకేష్‌ను ఎందుకు రహస్యంగా కలిశారో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ డైరెక్షన్‌లో భేటీలు జరగుతున్నాయని ఆరోపించారు. సాటుకు సంసారం చేసేది సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదేనని.. తిరిగి మాపైనే బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.






