Gram Sabha : గ్రామసభలో అధికారుల ముందే తొడకొట్టిన మహిళ!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-23 08:54:10  IST  )

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం లబ్ధిదారులు ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభ(Gram Sabha)లు చాల గ్రామాల్లో రసాభాస (Bustling)గా మారుతున్నాయి

Gram Sabha : గ్రామసభలో అధికారుల ముందే తొడకొట్టిన మహిళ!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం లబ్ధిదారులు ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభ(Gram Sabha)లు చాల గ్రామాల్లో రసాభాస (Bustling)గా మారుతున్నాయి. అనర్హులను ఎంపిక చేస్తున్నారని కొన్ని చోట్ల, అధికార పార్టీ వారినే ఎంపిక చేస్తున్నారని మరికొన్ని చోట్ల వాగ్వివాదాలు, తోపులాటలలో రచ్చరచ్చగా గ్రామసభలు సాగుతున్నాయి. లబ్ధదారుల జాబితాల్లో పేర్లు రాని చేస్తున్న ఆందోళనలు గ్రామసభలను మరింత వేడెక్కిస్తున్నాయి.

అధికారుల తీరు..పదేపదే దరఖాస్తులకు సంబంధించి నిలదీసే క్రమంలో ఓ యువతి(Young Woman) గ్రామసభలో అధికారుల ముందే తొడకొట్టి(Thigh Slapping)న ఘటన మహబూబాబాద్ జిల్లా దర్గా తండా గ్రామసభలో చోటుచేసుకుంది. అధికారుల తీరుపై యువతి ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ గా మారింది. మేం నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆ పథకం , ఈ పథకం అని, సర్వేలు అని..గ్రామసభలని ఉద్యోగానికి సెలవులు పెట్టి వస్తే గ్రామసభలకు వస్తే.. మీకు 10నిమిషాలు కూర్చోవడానికి ఓపిక లేదా? మాకు గాలి కావాలంటారని..మీరేం అధికారులు..అంటూ ఆ యువతి ఫైర్ అయ్యింది. మాకు గాలి కావాలంటారని

నాకు ఏదైనా గవర్నమెంట్ పథకం మంజూరైనా..ప్రభుత్వ సొమ్ము తిని ఉంటే నన్ను అడగండంటూ తొడ గొట్టి అధికారులకు సవాల్ చేసింది. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ మండిపడ్డారు. పదేపదే గ్రామాలకు రావాలంటే మాకు మా సంస్థలు సెలవులు ఇవ్వాలి కదా అని యువతి అసహనం వ్యక్తం చేసింది.

Next Story