- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకాగ్రతను సాధించే ఏకైక సాధనం యోగా.. ‘యోగా డే’ వేళ సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబురంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) యోగా డే సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విటర్) వేదికగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. మనలోనే నిగూఢమైన శక్తిని వెలికితీసేది ఏకగ్రతేనని అన్నారు. ఆ ఏకాగ్రతను సాధించే ఏకైక సాధానం యోగా అని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా అమూల్యమైన సాధనమని.. శరీరం, మనస్సు, ఆత్మకు మధ్య సమతుల్యతను సాధించే ప్రాచీన భారతీయ సంప్రదాయంగా యోగా వెలుగొందుతోందని పేర్కొన్నారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Next Story






