- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TPCC Cheif : మీ పార్టీకి రజాకార్ల మాట తప్ప అభివృద్ది మాటే ఉండదు : టీపీసీసీ చీఫ్
బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్.. బీజేపీ నాయకులకు(BJP Leaders) మతం తప్ప అభివృద్ధి అనే మాటే ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం రజాకార్ల ముచ్చట్లు చెప్పుకుంటూ పబ్బం గడుపుతారని ప్రశ్నించారు. బీజేపీ పాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రంలో అయినా సన్నబియ్యం ఇస్తున్నారా అని నిలదీశారు. తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్రానికి నిధులు తీసుకురావలనే సోయి ఉండదు కానీ, కుల మతాల పేరుతో రాజకీయాలు చేయడం బాగా వచ్చని ఎద్దేవా చేశారు.
దేశంలో అన్ని నగరాల్లో మెట్రో విస్తరిస్తుంటే.. మన రాష్ట్రంలో మెట్రోను విస్తరించడంలో అట్టడుక్కు పడిపోయామని.. దమ్ముంటే మెట్రో విస్తరణకు అనుమతులు తీసుకు రావాలని వారికి సవాల్ విసిరారు. రాష్ట్రం బాగు పడటం బీజేపీ నాయకులు అస్సలు ఇష్టం లేనట్టుందని.. అందుకే ప్రతీ పనికి అడ్డం పడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.






