నాడు తప్పు అయ్యింది, నేడు ఒప్పు ఎలా ఉత్తమ్..? హరీష్ రావు సంచలన ట్వీట్

by Ramesh Goud |

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతారా.. అని, నిండు శాసనసభను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) డిమాండ్ చేశారు.

నాడు తప్పు అయ్యింది, నేడు ఒప్పు ఎలా ఉత్తమ్..? హరీష్ రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతారా.. అని, నిండు శాసనసభను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) డిమాండ్ (Demand) చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ సమావేశంలో (Assembly Meetings) మాట్లాడిన వీడియో (Video) తో పాటు ఉత్తమ్ ఎథిక్స్ కమిటీకి రాసిన లేఖను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

దీనిపై ఆయన.. తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ గా ఉన్న సమయంలోనే మహువా మొయిత్రా (Mahuva Moithra) లోక్ సభ సభ్యత్వం (Loksabha Membership) రద్దు (ఎక్స్‌పెల్) (Expel) జరిగిందని ఈరోజు సభలో చెప్పుకున్న ఉత్తం కుమార్ రెడ్డి, తాను ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యంగ విరుద్ధమని అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారని అన్నారు. అలాగే తాను ఇచ్చిన అసమ్మతి నోట్ లో మహువా మెయిత్రాను వ్యక్తిగత ద్వేశం, ప్రతీకార చర్యల్లో భాగంగానే ఎక్స్‌పెల్ చేసారని సైతం పేర్కొన్నాడని తెలిపారు.

అంతేగాక నాడు గవర్నర్ పై దాడి (Attack On Governor) చేసిన విషయంలో ఎమ్మెల్యేలు సంపత్ కుమార్ (Sampath Kumar), కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) లను ఎక్స్‌పెల్ చేసిన సందర్భంలోనూ అది తప్పుడు చర్య అని, ఈ విషయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ మాట్లాడారని, నాడు స్పీకర్ (Speaker), ముఖ్యమంత్రి (Chief Minister) వారి విధులను సరిగ్గా నిర్వహించలేదని ఉత్తమ్ ఆరోపించాడని, నేడు ఆ మాటలను కూడా దాచి పెట్టారని చెప్పారు. ఒకవైపు తాను వ్యతిరేకించిన వాటినే నేడు ఉదాహరిస్తూ మరోవైపు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadeesh Reddy) పై కఠిన చర్యలు తీసుకోవాలనడం మీ కక్ష్య సాధింపు, ఉద్దేశ్య పూర్వక చర్యలను ప్రతిబింబిస్తున్నదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక తీరు, అధికారంలోకి రాగానే మరొక తీరు ప్రదర్శిస్తున్నారని, నాడు తప్పు అనిపించింది.. నేడు ఒప్పు ఎలా అనిపిస్తుంది ఉత్తమ్? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) ప్రశ్నించారు.

Next Story