చలికి గజగజ.. మరో 2 రోజులు తీవ్రమైన శీతల గాలులు.. ఎల్లో అలర్ట్

by Ramesh Naini |

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు గజ గజా వణుకుతున్నారు.

చలికి గజగజ.. మరో 2 రోజులు తీవ్రమైన శీతల గాలులు.. ఎల్లో అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు గజ గజా వణుకుతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు కప్పబడి ఉంటుంది. అలాగే సాయంత్రం 5 దాటితే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. అయితే, రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

రాబోయే రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో పలుచోట్ల అక్కడక్కడ కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

డిసెంబర్ 13వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Next Story