- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలోని ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం(Weather Station) కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు(Rain) కురిసే అవకాశముందని తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం(Weather Station) కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు(Rain) కురిసే అవకాశముందని తెలిపింది. ఈ సందర్భంగా పలు జల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో భారీ వర్షాలు అక్కడక్కడా కురిస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్న, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ ,వికారాబాద్, సంగారెడ్డి, జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ పేర్కొంది.
అప్రమత్తం :
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపారు. శనివారం పలు అధిక వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా సిద్దిపేట్ జిల్లా దుబ్బాకలో 6 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జల్లా అశ్వాపురం 3 సెం.మీ, సిద్దిపేట్ జిల్లా దౌల్తాబాద్ లో 3 సెం.మీ, కామారెడ్డి జిల్లా పిట్లంలో 2 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లో దాదాపుగా 30 సెం.మీ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.






