Yadagirigutta : వేణుగోపాలుడిగా యాదగిరిశుడు

by Y. Venkata Narasimha Reddy |

శ్రీ స్వయం భూ పంచ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్యయనోత్సవాల రెండో రోజున స్వామివారి ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి(కృష్ణావతారం)(Venugopala Swami) అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.

Yadagirigutta : వేణుగోపాలుడిగా యాదగిరిశుడు
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ స్వయం భూ పంచ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్యయనోత్సవాల రెండో రోజున స్వామివారి ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి(కృష్ణావతారం)(Venugopala Swami) అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం స్వామివారి ఆలయంలో నిత్యారాధలు, దివ్య ప్రబంధ పారాయణాలు నిర్వహించారు. సాయంత్రం నిత్యారాధనలు. ద్రావిడ ప్రబంధ పారాయణాల అనంతరం స్వామివారిని శ్రీ గోవర్థన గిరిధారి(Govardhana Giridhari)గా అలంకరించి తిరువీధులలో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో పులకించారు.

పాంచరాత్ర ఆగమశాస్రానుసారం అధ్యయనోత్సవాలను అర్చక, పండిత, పారాయణికులు శాస్త్రయుక్తంగా నిర్వహిస్తున్నారు. అధ్యయనోత్సవాలలో ఈవో భాస్కర్ రావు, ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు కొండూరి వెంకటాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రేపు ఆదివారం అధ్యయనోత్సవాల్లో స్వామివారికి శ్రీరామావతారంలో, శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార సేవలు నిర్వహిస్తారు.

Next Story