- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yadagirigutta: సంపూర్ణ చంద్రగ్రహణం ఎఫెక్ట్.. యాదగిరిగుట్ట ఆలయం మూసివేత
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse) నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఇవాళ ఉదయం అర్చకులు మూసివేశారు. గ్రహణ కాలంలో పాటించాల్సిన శాస్త్రోక్త నిబంధనల ప్రకారం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. గ్రహణ సమయానికి ముందే స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, కైంకర్యాలను ముగించి అర్చకులు గర్భాలయ ద్వారాలను మూసివేశారు. ఇక గ్రహణ కాలం ముగిసే వరకు భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేశారు.
రేపు దర్శనాలు పున:ప్రారంభం..
గ్రహణం వీడిన తర్వాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం రేపు ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. దూరప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు గ్రహణ సమయాలు ఆలయ వేళలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఆలయ ఈవో సూచించారు.






