TG: యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం

by Gantepaka Srikanth |

యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం

TG: యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: యాదగిరిగుట్ట(Yadagirigutta Temple)లో స్వామి వారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తిక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి ఆదాయం కూడా భారీగానే సమకూరింది. ఆదివారం కావడం, భక్తులు భారీ స్థాయిలో రావడంతో రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. ఇవాళ ఒక్కరోజే రూ.కోటి 4 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ మొత్తం స్వామివారిని 1,06,700 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు.

Next Story