కేసీఆర్‌కు యాదగిరిగుట్ట పూజారుల ఆహ్వానం

by Gantepaka Srikanth |

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి ఈనెల 23న మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు.

కేసీఆర్‌కు యాదగిరిగుట్ట పూజారుల ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి ఈనెల 23న మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆలయ పూజారులు ఆహ్వానించారు. అనంతరం మార్చి 1 నుంచి 11వ తారీఖు వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు యాదగిరి గుట్ట దేవస్థానం ప్రధాన పూజారి, ఆలయ కార్యనిర్వహణ అధికారులతో కూడిన బృందం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రాలతో కేసీఆర్‌కు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈఓ భాస్కర్, ముఖ్య అర్చకులు నరసింహమూర్తి, కిరణ్ కుమారాచార్యులు, పీఆర్ఓ రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story