- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yadagirigutta : ఇంకాసేపట్లో యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురం(Golden Flight Tower) ఆవిష్కరణ ఇంకాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)చేతుల మీదుగా జరుగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురం(Golden Flight Tower) ఆవిష్కరణ ఇంకాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)చేతుల మీదుగా జరుగనుంది. వానమామలై మఠం 31వ పిఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవం జరుగనుంది. మహాసంప్రోక్షణకు 40జీవనదుల జలాలను సేకరించారు.
స్వర్ణ విమాన గోపురం విశిష్టతలు పరిశీలిస్తే ఎత్తు 5.05అడుగులు. వైశాల్యం 10,759చదరపు అడుగులు. 68కిలోల బంగారంతో విమాన గోపురాన్ని స్వర్ణ రేకులతో 3.80కోట్లతో స్వర్ణ తాపడం చేశారు. తాపడం అమర్చే పనులకు మొత్తం 68కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీ, అమరిక పనులుకు రూ.8కోట్లు వెచ్చించారు. మార్చి 1నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందే స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన పనులు పూర్తి కానున్నాయి. స్వర్ణ విమాన గోపురంపై ఉన్న నృసింహ అవతారాలు, విష్ణుమూర్తి, లక్ష్మీ(ఆండాళ్ అమ్మవారు), గరుడమూర్తులు భక్తులకు స్వర్ణమయంగా కనువిందు చేయనున్నాయి.
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1నుంచి ప్రారంభమై 23వరకు కొనసాగుతాయి. 8న స్వామి అమ్మవార్ల కల్యాణోత్సం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి అలంకార, వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు.






