Yadagirigutta : యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ

by Y. Venkata Narasimha Reddy |

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు గిరి ప్రదక్షిణ(Giri Pradakshina) కార్యక్రమం ఘనంగా జరిగింది.

Yadagirigutta : యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు గిరి ప్రదక్షిణ(Giri Pradakshina) కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించే గిరి ప్రదర్శనలో నారసింహ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల నమో నారసింహ, గోవింద నామస్మరణతో యాదగిరి మారుమ్రోగింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కరరావు ఇతర ప్రముఖులు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.

అటు ప్రధానాలయంలో స్వామివారికి స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, అర్చనలు నిర్వహించి మంగళా నీరాజనాలు సమర్పి్ంచారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి.

Next Story