నేడు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం.. హాజరుకానున్న మంత్రులు

by Kema Shiva Kumar |

నల్గొండ (Nalgonda) జిల్లా దామరచర్ల సమీపంలోని వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (Yadadri Thermal Power Station)తొలి 800 మెగావాట్ల యూనిట్‌ను ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు.

నేడు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం.. హాజరుకానున్న మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ (Nalgonda) జిల్లా దామరచర్ల సమీపంలోని వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (Yadadri Thermal Power Station)తొలి 800 మెగావాట్ల యూనిట్‌ను ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka)తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొననున్నారు. అదేవిధంగా రూ.950 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ (Integrated Township) పనులకు మంత్రలు శంకుస్థాపన చేయనున్నారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TS GENCO) నిర్మిస్తోంది. మొత్తం ఐదు యూనిట్లలో భాగంగా.. ఇవాళ తొలి యూనిట్‌లో ట్రయల్ రన్ ఎప్పుడో ప్రారంభమైంది. అయితే, ఇవాళ అఫీషియల్‌గా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాబోతోంది. అయితే, తెలంగాణలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగుకుండా ఉండేందుకు సర్కార్ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేందాన్ని అప్పడి బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.36,131.99 కోట్లు ఖర్చు అయింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఈ ప్రాజెక్టును ఈపీసీ పద్ధతిలో నిర్మించింది. ఈ ప్లాంట్ ద్వారా 2034-35 నాటికి 31,809 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.

Next Story