Yadadri: యాదాద్రిలో ఘనంగా అధ్యయనోత్సవాలు.. రామావతారంలో నరసింహుడు

by Ramesh Goud |

యాదాద్రి(Yadadri) పుణ్య క్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Yadadri: యాదాద్రిలో ఘనంగా అధ్యయనోత్సవాలు.. రామావతారంలో నరసింహుడు
X

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి(Yadadri) పుణ్య క్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి(Lakshmi Narasimha Swamy) ఇవాళ రామావరంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదగిరి గుట్ట(Yadagiri Gutta) లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయములో శుక్రవారము నుండి బుధ వారము వరకు స్వామి వారి అధ్యయనోత్సవములు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదివారం ఉదయం స్వామి వారిని శ్రీ రామావతారములో అలంకరించి, భక్తుల దర్శనార్థము ఆలయ తిరువీధులలో ఊరేగింపు వేడుక నిర్వహించారు.

ఈ వేడుకలకు ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, వేద పండితులు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భక్తులు రామావతారంలో ఉన్న స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు నరసింహస్వామి రామావతారం విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నరసింహస్వామి తిరు వేంకటపతి అలంకారము గావిస్తారని ప్రధానార్చకులు భక్తులకు తెలియజేశారు. మరో రెండు రోజుల పాటు జరిగే వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారి సేవలో పాల్గొనాలని అర్చకులు పిలుపునిచ్చారు.

Next Story