నిమ్స్ ఆసుప‌త్రిలో ప్ర‌పంచ స్థాయి వైద్య సేవ‌లు : వేం చారిట‌బుల్ ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కులు భార్గవ్ రెడ్డి

by Muthe.Rajitha |

పేద‌ల ఆస్ప‌త్రిగా పేరుగాంచిన పంజాగుట్ట నిమ్స్ ఆస్ప‌త్రిలో ప్ర‌పంచ స్థాయి వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని, ఆస్ప‌త్రి అభివృద్ధికి త‌మ వంతు పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని వేం చారిట‌బుల్ ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కులు డాక్ట‌ర్ భార్గ‌వ్ రెడ్డి అన్నారు.

నిమ్స్ ఆసుప‌త్రిలో ప్ర‌పంచ స్థాయి వైద్య సేవ‌లు : వేం చారిట‌బుల్ ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కులు భార్గవ్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేద‌ల ఆస్ప‌త్రిగా పేరుగాంచిన పంజాగుట్ట నిమ్స్ ఆస్ప‌త్రిలో ప్ర‌పంచ స్థాయి వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని, ఆస్ప‌త్రి అభివృద్ధికి త‌మ వంతు పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని వేం చారిట‌బుల్ ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కులు డాక్ట‌ర్ భార్గ‌వ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ న‌గ‌రి బీర‌ప్ప‌ను క‌లిసి అభివృద్ధి ప‌నుల‌పై చ‌ర్చించారు. ఆస్ప‌త్రిలో పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని భార్గ‌వ్ రెడ్డి అన్నారు. మ‌రింత మంది పేద‌ల‌కు సేవ‌లు అందేందుకు త‌మ ట్ర‌స్టు స‌హ‌కారం కూడా ఉంటుంద‌ని అన్నారు. వేం చారిట‌బుల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల బీపీ టెల్లింగ్ యంత్రాలు, ఇత‌ర ప‌రిక‌రాలను ఆస్ప‌త్రికి స‌మ‌కూర్చిన విష‌యం తెలిసిందే.

Next Story