బుద్ధుడి పాదాలకు ప్రపంచ అందగత్తెల పూజలు

by Gantepaka Srikanth |

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది కంటెస్టెంట్స్ బృందం సోమవారం నల్గొండ జిల్లా బుద్ధ వనాన్ని సందర్శించింది.

బుద్ధుడి పాదాలకు ప్రపంచ అందగత్తెల పూజలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది కంటెస్టెంట్స్ బృందం సోమవారం నల్గొండ జిల్లా బుద్ధ వనాన్ని సందర్శించింది. ప్రపంచ సుందరీమణులకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఘనంగా ఆతిథ్యమిచ్చింది. జిల్లా కలెక్టర్ త్రిపాఠి బృందం విజయ విహార్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికింది. ముందుగా సుందరీమణుల బృందం నాగార్జున సాగర్ తీరాన ఉన్న విజయ విహార్‌లో ఫొటోలు దిగారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి మహా స్థూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు.

మహాస్థూపం వద్ద ప్రపంచ సుందరీమణులకు లంబాడా కళాకారులు లంబాడా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు. అనంతరం జాతకవనంలో బుద్ధ చరితంపై కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, బత్తుల లక్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




Next Story