- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MBNR: పిల్లలమర్రిని సందర్శించిన ప్రపంచ అందగత్తెలు
మిస్ వరల్డ్ - 2025(Miss World - 2025) పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ సుందరీమణులు ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మిస్ వరల్డ్ - 2025(Miss World - 2025) పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ సుందరీమణులు ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. 22 దేశాల నుంచి తరలివచ్చిన సుందరీమణులు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి(Pillalamarri)ని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి మహావృక్షం కింద గురుకుల పాఠశాలల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఫోటోషూట్ చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లలమర్రి వద్ద ఆంక్షలు విధించారు. 13 వందల మంది పోలీసులతో మూడంచల బందోబస్తు ఏర్పాటు చేశారు. పిల్లలమర్రి సందర్శన అనంతరం 16వ శతాబ్దం నాటి శ్రీరాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత పురావస్తు మ్యూజియంను సందర్శిస్తారు. కాగా, పిల్లలమర్రికి 750 ఏళ్ల చరిత్ర ఉంది. మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం ప్రపంచ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.






