- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG RTC బస్సులో ప్రయాణించనున్న ప్రపంచ అందగత్తెలు.. ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ అందగత్తెలు(World Beauties) సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని(Buddha Vanam) సందర్శించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ అందగత్తెలు(World Beauties) సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని(Buddha Vanam) సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు(TG RTC Bus)లో వీరినీ నాగార్జునసాగర్(Nagarjunasagar)కు తీసుకువెళ్తున్నారు. మార్గంమధ్యలో నల్లగొండ జిల్లా చింతపల్లి సమీపంలోని అతిథిగృహం వద్ద కొంతసేపు ఆగి.. విజయ్‌విహార్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అక్కడే ఫొటోలు దిగి నేరుగా బుద్ధవనం చేరుకుంటారు. తెలంగాణలోని టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్శనకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా, మయన్మార్, వియత్నం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేసియా, జపాన్, కజకిస్తాన్, కిర్గికిస్తాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయిలాండ్, ఆర్మేనియా నుంచి వచ్చినవారు మాత్రం బుద్ధవనం సందర్శిస్తారు.






