- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే.. అవగాహన ర్యాలీ
వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భాన్ని పురస్కరించుకొని ఉస్మానియా పీజీ కళాశాలలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భాన్ని పురస్కరించుకొని ఉస్మానియా పీజీ కళాశాలలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి కార్యాలయం, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు డా. కొడూరి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, రోగ నిర్ధారణ పరీక్ష శిబిరాలు, ఆరోగ్య శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతలో ఈ వ్యాధి పట్ల చైతన్యం పెంపొందించడం అత్యంత ప్రధాన అంశమని తెలిపారు. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారిని దూరంగా పెట్టడమంటే సమాజానికి మచ్చతేవడమేనని, వారికి అండగా నిలబడి ప్రోత్సహించడం మన మానవత్వం నిరూపించుకోవడం అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీని లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు రామకృష్ణ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.






