- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ ఆర్థోస్కోపీ ఫౌండేషన్, ఆర్.వి.ఎం మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో వర్క్ షాప్
హైదరాబాద్ ఆర్థోస్కోపీ ఫౌండేషన్, ఆర్.వి.ఎం మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు “హైదరాబాద్ షోల్డర్ కోర్స్ 2025” క్యాడావర్ వర్క్‌షాప్ ప్రోగ్రాం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఆర్.వి.ఎం మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ ఆర్. యాకయ్య, డీన్, ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

- క్యాడావర్ డెమోనిస్ట్రేషన్ కి హాజరైన అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులు
- వైద్య రంగంలో నేర్చుకోవడం ఒక నిరంతర ప్రక్రియ అంటున్న వైద్యులు
దిశ తెలంగాణా బ్యూరో: హైదరాబాద్ ఆర్థోస్కోపీ ఫౌండేషన్, ఆర్.వి.ఎం మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు “హైదరాబాద్ షోల్డర్ కోర్స్ 2025” క్యాడావర్ వర్క్‌షాప్ ప్రోగ్రాం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఆర్.వి.ఎం మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ ఆర్. యాకయ్య, డీన్, ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ ఏడాది “సరి చేయలేని రోటేటర్ కఫ్ టియర్” అనే ప్రత్యేక థీమ్ చుట్టూ జరిగిన ఈ వర్క్‌షాప్ లో దేశీయ,అంతర్జాతీయ స్థాయి ఆర్థోపెడిక్ నిపుణులు పాల్గొన్నారు. క్యాడావర్ డెమోనిస్ట్రేషన్ ఫ్యాకల్టీగా ఈ క్రింది టాపిక్ లకు ట్రైనర్స్ గా అంతర్జాతీయంగా పేరొందిన ఆయా దేశాల నిపుణులు పాల్గొన్నారు.
లాటిసిమస్ డోర్సీ యాంటీరియర్ డిసెక్షన్ కి డా. జీన్ గ్రింబర్గ్ (ఫ్రాన్స్), లాటిసిమస్ డోర్సీ పాక్షియల్ డిసెక్షన్ కి డా. విటోరాస్ జెర్మోలాజేవాస్ (లిథువేనియా),లోయర్ ట్రాపిజియస్ హార్వెస్టింగ్ కి డా. ఛాంగ్ హీ బేక్ (దక్షిణ కొరియా),మసిల్ స్లైడ్ ఓపెన్ పార్ట్ కి డా. ఛాంగ్ హీ బేక్ (దక్షిణ కొరియా),ఆర్థోస్కోపిక్ అసిస్టెడ్ ట్రాపిజియస్ ట్రాన్స్‌ఫర్ కి డా. బి చంద్రశేఖర్ (కిమ్స్ సన్‌షైన్),షోల్డర్ సర్జన్ - డా.శ్యామఅనూప్ రెడ్డి రెనోవా సెంచరీ హాస్పిటల్స్ ,ఇన్‌స్పేస్ బెలూన్ కి డా. అశిష్ గుప్తా (ఆస్ట్రేలియా)మసిల్ స్లైడ్ ఆర్థోస్కోపిక్ కి డా. జీన్ కానీ (ఫ్రాన్స్)ఆర్థోస్కోపిక్ లాటిసిమస్ డోర్సీ ట్రాన్స్‌ఫర్ కి డా. జీన్ కానీ(ఫ్రాన్స్ ఆర్ఎస్‌ఏ విత్ లాటిసిమస్ డోర్సీ ట్రాన్స్‌ఫర్ కి డా. జీన్ గ్రింబర్గ్ (ఫ్రాన్స్) శిక్షకులుగా వ్యవహరించారు .ఈ శిక్షణకు అదనంగా, 3D సిమ్యులేటర్ ఆర్ఎస్‌ఏ సా బోన్ వర్క్‌షాప్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వర్క్‌షాప్ ద్వారా పాల్గొన్న దేశీయ అంతర్జాతీయ డాక్టర్స్ రోటేటర్ కఫ్ టియర్ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలపై ప్రత్యక్ష ప్రాక్టికల్ అనుభవాన్ని పొందారు. అంతర్జాతీయ నిపుణుల శిక్షణ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని ద్వారా అత్యాధునిక వైద్య పద్ధతులపై శిక్షణ లభించిందని పలువురు వైద్యులు పేర్కొన్నారు.






