- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాడు బహిష్కరించి నేడు శిక్షణ.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారిన బీఆర్ఎస్ వర్క్ షాప్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గండిపేటలో శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై ఏకంగా వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇవాళ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ వర్క్ షాప్ కొనసాగుతోంది. సభలో లేవనెత్తాల్సిన ప్రజాసమస్యలు, రూల్ బుక్, రాజ్యాంగ అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా సమకాలీన రాజకీయాలు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీలో ప్రాజాసమస్యలపై ప్రస్తావించే విధానంపై సబ్జెక్ట్ నిపుణులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాచార హక్కు చట్టంపై కూడా నిపుణులతో తరగతులు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆసక్తిగా బీఆర్ఎస్ వ్యూహం:
బడ్జెట్ సమావేశాల వేళ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిసారి తమ పార్టీకి చెందిన సభ్యులకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు దిశానిర్దేశం చేయడం సర్వసాధారణమే. బీఆర్ఎస్ సైతం ఇలాగే చేసింది. కానీ ఈసారి సబ్జెక్ట్ నిపుణుల చేత శిక్షణ ఇప్పించబోతున్నారనే ప్రచారం ఇంట్రెస్టింగ్‍గా మారింది. దీంతో అధికార పార్టీని ఇరాకాటంలో పెట్టే విషయంలో బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోందా? లేక అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో విఫలం కావడం వల్లే నిపుణులతో సొంత సభ్యులకు శిక్షణ ఇప్పిస్తోందా? అసలు బీఆర్ఎస్ స్కెచ్ ఏంటీ అనేది చర్చనీయాశంగా మారింది. నిజానికి 11,12 డిసెంబర్ 2024 లో ప్రజాభవన్‍లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ శిక్షణ దోహదపడుతుందని ప్రభుత్వం చెప్పినా నాటి తరగతులను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఇప్పుడు తాజాగా నిపుణుల చేత శిక్షణ ఇప్పిస్తుండటంతో ఈ క్లాసుల తర్వాత బీఆర్ఎస్ ఫర్మార్మెన్స్ ఎలా ఉండబోతోంది అనేది బడ్జెట్ సెషన్‍లో తేలనుంది.
కేసీఆర్‍తో పాటు ఆ ఎమ్మెల్యేలు డుమ్మా:
బీఆర్ఎస్ నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు పార్టీ చీఫ్ కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సైతం హాజరు కాలేదు. మొత్తం 10 ఎమ్మెల్యేలు ఫిరాయింపు విచారణ ఎదుర్కొన్నారు. వీరిలో ఇప్పటికే 8 మంది తాము తాము బీఆర్ఎస్‍లోనే కొనసాగుతున్నామని స్పీకర్ విచారణలో అంగీకరించడంతో వారికి గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో తీర్పు రిజర్వ్ లో ఉంది. స్పీకర్ విచారణ అనంతరం అసెంబ్లీ సమావేశాలు తొలిసారి జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహిస్తున్న వర్క్ షాప్‍కు ఈ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు. దీంతోబడ్జెట్ సమావేశాల సందర్భంగా వీరంతా సభలో ఎటువైపు కూర్చుంటారు అనేది ఆసక్తిగా మారింది.






