ప్రజల కోసం పనులు.. ఇంజనీర్లకు ఇస్కీలో ఆధునిక శిక్షణ

by Ramesh Naini |

పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో జరిగే ప్రతి పని ప్రజల కోసమే కాబట్టి ఆ శాఖలో పనిచేసే ప్రతి అధికారి కూడా ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారిగా, వారి పనితీరును మెరుగు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఇస్కీ డైరెక్టర్ రామేశ్వర్ రావు అన్నారు.

ప్రజల కోసం పనులు.. ఇంజనీర్లకు ఇస్కీలో ఆధునిక శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో జరిగే ప్రతి పని ప్రజల కోసమే కాబట్టి ఆ శాఖలో పనిచేసే ప్రతి అధికారి కూడా ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారిగా, వారి పనితీరును మెరుగు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఇస్కీ డైరెక్టర్ రామేశ్వర్ రావు అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 29 మంది ఇంజనీరింగ్ అధికారుల మొదటి బ్యాచ్ శిక్షణ సోమవారం ఇస్కీలో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా రామేశ్వర్ రావు మాట్లాడుతూ ఇస్కీలోని సివిల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్కిటెక్చర్ ప్లానింగ్, మోడ్రన్ కనస్ట్రక్షన్ టెక్నాలాజీలో భాగంగా బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మాడలింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సంబంధించి డాక్టర్ ఎస్పీ అంచూరి, డాక్టర్ వెంకట దిలీప్ కుమార్ పసుపులేటి వివరించారు. వచ్చే శుక్రవారం వరకు జరిగే ఈ శిక్షణలో అడ్వాన్స్ బీఐఎం కాన్సెప్ట్స్, 3డీ మాడ్లింగ్, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, ప్రీ క్యాస్ట్ కాంక్రీట్ అండ్ హై రైజ్ నిర్మాణాలు, 3డీ ప్రింటింగ్, సైట్ ప్లానింగ్, స్పేస్ ప్లానింగ్, ఎనర్జీ, ఎఫిషియంట్, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్ తదితర వాటిపై నిపుణులైన సీనియర్ ఇంజినీర్లు శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ జి. రామేశ్వర్ రావు తెలిపారు.

Next Story