Damodara: రాజకీయాలకు అతీతంగా అందుకు కృషి చేయండి.. నూతన సర్పంచ్‍లకు మంత్రి దామోదర పిలుపు

by Prasad Jukanti |

రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని కొత్త గ్రామపాలక వర్గాలకు మంత్రి దామోదర పిలుపునిచ్చారు.

Damodara:  రాజకీయాలకు అతీతంగా  అందుకు కృషి చేయండి.. నూతన సర్పంచ్‍లకు మంత్రి దామోదర పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‍లు, ఉప సర్పంచ్‍లు గ్రామ వార్డు సభ్యులకు మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarasimha) పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికై, నేడు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన నూతన గ్రామ పాలక కమిటీలకు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీలే అత్యంత కీలకమైనవని, మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యం' సాకారం కావడంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో అమూల్యమని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యత స్థానిక పాలకవర్గాలదేనని మంత్రి గుర్తుచేశారు. "మీ పదవీ కాలంలో గ్రామాల రోడ్లు, పరిశుభ్రత, పారిశుధ్యం (Sanitation), స్వచ్ఛమైన తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టి, 'ఆరోగ్య తెలంగాణ' సాధనలో మీ వంతు సహకారం అందించాలని మంత్రి కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా చూడాలని సూచించారు. దేశానికి తెలంగాణ పల్లెలు ఆదర్శ, ఆరోగ్య గ్రామాలుగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.

Next Story