నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు

by Muthe.Rajitha |

సినీ నటుడు శివాజీ ఇటీవల ధండోరా సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది.

నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ నటుడు శివాజీ ఇటీవల ధండోరా సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. శివాజీ వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించాయనే ఆరోపణలపై సుమోటోగా కేసును స్వీకరించి విచారణ ప్రారంభించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వ్యాఖ్యలలో మహిళల పట్ల అవమానకర ధోరణి ఉందని నిర్ధారించిన కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ చట్టం 1998 సెక్షన్ 16(1)(b) ప్రకారం శివాజీకి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 27 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని, సంబంధిత ఆధారాలు తీసుకురావాలని ఆదేశించింది. కాగా ఈ ఘటనపై శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.

Next Story