తక్షణమే డీటైల్డ్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి.. డీజీపీకి మహిళా కమిషన్‌ ఆదేశాలు

by Prasad Jukanti |

మహిళా జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదుపై నేరెళ్ల శారద స్పందించారు.

తక్షణమే డీటైల్డ్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి.. డీజీపీకి మహిళా కమిషన్‌  ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‍లైన్ వేధింపులు, బెదిరింపులపై మహిళా జర్నలిస్టులు (Women Journalists) ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ (Women's Commission) స్పందించింది. ఈ అంశంలో తక్షణమే డిటైల్డ్ ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని విచారణ జరిపిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద (Nerella Sharada) ఆదేశించారు. మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛాయుత అభిప్రాయ వ్యక్తీకరణను కాపాడటం మా ప్రాధాన్య బాధ్యత అని ఈ విషయంలో మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ముందుండి కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మహిళలపై దాడులు చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదని హెచ్చరించారు. కాగా సామాజిక మాధ్యమాల్లో తమ భావాలు వ్యక్తం చేసే మహిళా జర్నలిస్టులు, మహిళలను బూతులు తిట్టడమే పనిగా కొంత మంది పెట్టుకున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిన్న పలువురు మహిళా జర్నలిస్టులు హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ తో పాటు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నేరెళ్ల శారద ఇవాళ ఎక్స్ వేదికగా స్పందిస్తూ డీజీపీ జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన పత్రాన్ని షేర్ చేశారు.

Next Story