మహిళలు వాటిని ఉపయోగించుకోవాలి.. బస్సు ప్రయాణంలో మంత్రి కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |

మహిళా దినోత్సవం (Women's Day) సందర్భంగా తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ప్రయాణించారు.

మహిళలు వాటిని ఉపయోగించుకోవాలి.. బస్సు ప్రయాణంలో మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మహిళా దినోత్సవం (Women's Day) సందర్భంగా తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ హైదరాబాద్ (Hyderabad) లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ (MGBS Bus Station) లో పర్యటించారు. అనంతరం అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు (traveled). బస్సులో ప్రయాణికులతో ముచ్చటిస్తూ.. బస్సు ప్రయాణంలో (bus journey) తలెత్తుతున్న ఇబ్బందులపై (problems) ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం (Telangana government) పక్షాన మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయని, మహిళలు అందరూ వాటిని ఉపయోగించుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు.

అనంతరం ఆర్టీసీ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులలో అత్యంత ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించారు. తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో మహిళా ప్రయాణికులకు గులాభి పూలు (roses), స్వీట్లు (Sweets)పంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు (Womens Day Wishes) తెలియజేశారు. అంతకముందు మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఇంట్లో మహిళలను సత్కరించి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తన తల్లికి పాదాభివందనం చేసి, తల్లితో పాటు, తన సతీమణికి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. వీరత్వము (bravery), దీరత్వం (perseverance), మాతృత్వం (motherhood) కలిగి భవిష్యత్ అనే అంశానికి మాతృమూర్తి కారణమైన సందర్భంలో మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని అన్నారు.

Next Story