- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఏ గాళ్లు ఓట్లు వేస్తేనే గెలిచారా? ఎమ్మెల్యేలు, ఎంపీల పీఏలకు సామాన్య మహిళ స్ట్రాంగ్ వార్నింగ్
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల పీఏలపై ఓ సామాన్య మహిళ సోషల్ మీడియాలో విరుచుకుపడింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ ప్రజాప్రతినిధులు అయినా పీఏలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఓట్లు వేస్తేనే గెలవలేదని ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల పీఏలపై ఓ సామాన్య మహిళ సోషల్ మీడియాలో విరుచుకుపడింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ ప్రజాప్రతినిధులు అయినా పీఏలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఓట్లు వేస్తేనే గెలవలేదని ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచారని అన్నారు. కానీ ప్రజలకు ఏమైనా కష్టం వచ్చిందని వెళితే పీఏలు అడ్డుకుంటారని అన్నారు.
మీ కుటుంబ సభ్యుల అపాయింట్మెంట్లు అడగట్లేదని ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన నాయకుల అపాయింట్ మెంట్లు అడిగితే ఎందుకు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వేసిన నాలుగు ఓట్లతోనే గెలవలేదని అపాయింట్మెంట్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నప్పుడు అసలు ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నారని విరుచుకుపడ్డారు. పర్సనల్ పనులు చేసుకునేందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి చేసే పీఏలను చెప్పుతో కొట్టాలి అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. video






