- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HMDA: మహిళా ఉద్యోగుల భద్రత కోసం.. హెచ్ఎండీఏలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో మహిళల భద్రత కోసం అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో మహిళల భద్రత కోసం అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మప్రియ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో ప్లానింగ్ విభాగంలోని డీఏఓ-1 మంజుల, అర్బన్ ఫారెస్ట్రీ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ .జి.శ్రీవాణి, ఓఆర్ఆర్ ప్రాజెక్టు విభాగంలోని తహశీల్దార్ జి.వసుందరవళి, అర్బన్ ఫారెస్ట్రీ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సయ్యద్ ఖాజా నిజాముద్దీన్ సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు భూమిక ఉమెన్ కలెక్టివ్(ఎన్జీఓ) నుంచి కె.సత్యవతిని సైతం కమిటీలో సభ్యురాలుగా తీసుకున్నారు.
హెచ్ఎండీఏకు సంబంధించిన ఏ విభాగంలోనైనా మహిళా ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసిన కమిటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొంతమంది ఘటన జరిగిన ఫిర్యాదులు చేయడానికి భయపడుతుంటారు.. అయితే ఘటన జరిగిన 3 నెలల్లో ఎప్పుడైనా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.






