TG RTC: బస్సులో కల్లు తీసుకురావొద్దాంటావా?.. బస్సుకు అడ్డు నిలబడి మహిళా నిరసన

by Prasad Jukanti |   (  Updated:2025-05-05 05:12:09  IST  )

బస్సులోకి కల్లు తీసుకు రావొద్దని డ్రైవర్ చెప్పడంతో ఓ మహిళా నిరసన వ్యక్తం చేసింది.

TG RTC: బస్సులో కల్లు తీసుకురావొద్దాంటావా?.. బస్సుకు అడ్డు నిలబడి మహిళా నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో ఆర్టీసీకి (TG RTC) సంబంధించి వెరైటీ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం అవకాశం కల్పించడంతో చాలా చోట్ల ప్రయాణికులు సీట్ల కోసం పరస్పర దాడులకు పాల్పడుతుంటే మరి కొన్నిచోట్ల సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. ఈ క్రమంలో బస్సులోకి కల్లు తీసుకురావొద్దని డ్రైవర్ అడ్డు చెప్పారని ఓ మహిళా ప్రయాణికురాలు ఏకంగా ఆ బస్సుకు అడ్డుగా నిలబడి నిరసన తెలిపింది. నల్గొండ బోర్డుతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు సదరు మహిళ అడ్డుగా నిలబడి బస్సులో కల్లు (TODDY) తీసుకుపోవద్దని రూల్ ఎక్కడుందని డ్రైవర్, కండక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ కల్లును బస్సులో తీసుకుపోవడాన్ని నిషేధించారా? మన రాష్టంపై బ్యాన్ ఉందా? ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలని కొంత మంది కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు నెటిజన్లు ఆర్టీసీలో కల్లు ఎలా తీసుకువెళ్లనిస్తారని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు తమ వెంట ఏయే వస్తువులు తీసుకువెళ్లాలి వేటిని తీసుకువెళ్లకూడదో ప్రయాణికులకు మరోసారి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Read More..

Viral Video: అన్ని రంగాల్లో మాత్రమే కాదు.. స్మోకింగులో కూడా క్వీన్ లు మన లేడీసే అట..షాకింగ్ వీడియో

Next Story