BRS అభ్యర్థి డబ్బులు ఇవ్వడం లేదని రోడ్డెక్కిన మహిళలు.. మిర్యాలగూడలో వింత ఘటన..!

by Satheesh |   (  Updated:2023-11-29 16:24:08  IST  )

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో షూరు కానుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు లీడర్లు ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లకు పెద్ద ఎత్తున మద్యం, మనీ

BRS అభ్యర్థి డబ్బులు ఇవ్వడం లేదని రోడ్డెక్కిన మహిళలు.. మిర్యాలగూడలో వింత ఘటన..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో షూరు కానుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు లీడర్లు ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మద్యం, మనీ పంచుతూ ఓటర్లను ప్రభోభాలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో నగదు పంపిణీ విషయంలో కొన్ని చోట్ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలానా పార్టీ పార్టీ నేతలు తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఓటర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మిర్యాలగూడ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

మిర్యాలగూడ పట్టణంలోని 39 వార్డు సుందరయ్య నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నేతలు కొందరికే డబ్బులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పక్క వార్డుల్లో డబ్బులు పంచి.. తమ వార్డులో మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలపై మహిళలు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పలువురు మహిళా ఓటర్లు ఆందోళనకు దిగారు. తమ పక్క వార్డుల్లో డబ్బులు ఇచ్చి.. తమకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. తమకు కూడా డబ్బులు ఇవ్వాలని.. మేం ఓటు వేయనిదే గతంలో ఎమ్మెల్యే అయ్యారు అని నిలదీస్తున్నారు. కాగా, డబ్బులు పంపణీ చేయడం లేదని ఓటర్లు రోడ్డెక్కి ఆందోళన చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story