HYDERABAD: హైదరాబాద్‌లో కలకలం.. ట్రావెల్ బ్యాగులో యువతి డెడ్ బాడీ

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ బాచుపల్లిలో కలకలం రేగింది. ట్రావెల్ బ్యాగులో గుర్తు తెలియని డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు.

HYDERABAD: హైదరాబాద్‌లో కలకలం.. ట్రావెల్ బ్యాగులో యువతి డెడ్ బాడీ
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్ బాచుపల్లిలో కలకలం రేగింది. ట్రావెల్ బ్యాగులో గుర్తు తెలియని డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. బాచుపల్లిలో రెడ్డీస్ ల్యాబ్ ప్రహరీ గోడను ఆనుకుని ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఓ ట్రావెల్ బ్యాగు పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. బ్యాగు నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బ్యాగులో డెడ్ బాడీ ఉన్నట్టు గుర్తించారు. మృతురాలు మెరూన్ క‌ల‌ర్ చుడిదార్ ధ‌రించి ఉండ‌గా ఆమె వ‌య‌సు 25 నుండి 30 మ‌ధ్య ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. బాలాన‌గ‌ర్ డీసీపీ సురేష్ కుమార్ ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌రలించారు.

Next Story