T Congress: పదవులన్నీ మీ బంధువులకేనా?.. గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతల ఆందోళన

by Prasad Jukanti |

పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ చాంబర్ ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.

T Congress: పదవులన్నీ మీ బంధువులకేనా?.. గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాంధీ భవన్ (Gandhi Bhavan) లోని పీసీసీ చీఫ్ మహేస్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) చాంబర్ ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ప్రభుత్వం, కార్పొరేషన్ పదవుల్లోనూ మహిళా నేతలకు సరైనా ప్రాధాన్యత దక్కడం లేదని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు (Sunitha Rao) ఆధ్వర్యంలో మహిళా నేతలు ఆందోళనకు దిగారు. పదవులన్నీ పీసీసీ మహేశ్ గౌడ్ బంధువులకే ఇచ్చుకుంటున్నారని కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలను విస్మరించడం తగదన్నారు. ఎన్నో ఏళ్ల నుండి పార్టీని నమ్ముకుని కుటుంబాన్ని సైతం వదిలి పార్టీకోసం పని చేస్తున్న తమకి కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story