వివాహేతర సంబంధాల్లో మహిళలే టాప్.. సెకండ్ ప్లేస్‍లో HYD.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు

by Prasad Jukanti |

భారత్‌లో వివాహేతర డేటింగ్ యాప్స్ వినియోగంపై గ్లీడెన్ సర్వే తన రిపోర్టును వెల్లడించింది.

వివాహేతర సంబంధాల్లో మహిళలే టాప్..  సెకండ్ ప్లేస్‍లో HYD.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో వివాహ బంధాల‌పై ఓ స‌ర్వే షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టింది. గ్లీడెన్ అనే ప్రముఖ డేటింగ్ యాప్ వివాహం త‌ర‌వాత అక్రమ సంబంధాలపై చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ స‌ర్వే రిపోర్ట్ ప్రకారం భార‌త్‍లో డేటింగ్ యాప్స్ వినియోగిస్తున్న మ‌హిళ‌ల సంఖ్య రెండేళ్లలో 148 శాతం పెరిగింది. మోడరన్ లైఫ్ స్టైల్, ఎమోష‌న‌ల్‍గా సంతృప్తి లేక‌పోవ‌డం వ‌ల్ల పెళ్లి త‌ర‌వాత అక్రమ సంబంధాల కోసం వెతుకుతున్నట్లు స‌ర్వే రిపోర్ట్ లో పేర్కొంది. నివేదిక‌ల ప్రకారం డేటింగ్ యాప్ వినియెగిస్తున్నవారిలో 65 శాతం పురుషులు ఉండ‌గా, 35 శాతం మ‌హిళ‌లు ఉన్నట్లు తెలిపింది.

సెకండ్ ప్లేస్ లో హైదరాబాద్:

ఈ యాప్‍లో 18 శాతం యూజర్లతో బెంగళూరు నగరం మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్(17 శాతం) రెండో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వతా ఢిల్లీ (11శాతం), ముంబయి (9 శాతం) యూజర్లను కలిగి ఉన్నాయి. కేవలం మెట్రో నగరాలే కాకుండా లక్నో, చండీగఢ్, సూరత్, పాట్నా, గువహటి వంటి చిన్న నగరాల్లో కూడా ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. తమిళనాడులోని సంప్రదాయ నగరమైన కాంచీపురం కూడా ఇలాంటి సంబంధాలకు హాట్‌స్పాట్‌గా మారుతోందని నివేదిక పేర్కొంది.

కొత్తదనం కోసం:

మోడ్రన్ లైఫ్‌స్టైల్, ఎమోషనల్‌గా తమ జీవిత భాగస్వామితో సంతృప్తి లేకపోవడం, తమ పార్ట్ నర్ తమకు సమయం ఇవ్వకపోవడం, కొత్తదనంతో పాటు థ్రిల్ కోసం కూడా వివాహేత‌ర సంబంధాల వైపు చూస్తున్నార‌ని ఈ సర్వేలే తేలింది. యూజర్లు సగటున రోజుకు 1 నుంచి 1.5 పాటు ఈ యాప్ లో సమయం గడుపుతున్నారని ముఖ్యంగా మధ్యాహ్నం 12-3 గంటలు, రాత్రి 10 తర్వాత యాక్టివిటీ ఎక్కువగా ఉంటోందని ఈ గణాంకాలు వెల్లడించాయి. మహిళలలు ఎక్కువగా ఆర్థికంగా స్థిరపడిన డాక్టర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్లను భాగస్వాములుగా కోరుకుంటున్నట్లు ఈ సర్వే నివేదిక స్పష్టం చేసింది. టెక్నాలజీ పుణ్యమా అని ‘సీక్రెట్ అఫైర్స్’ ఈజీ అవ్వడంతో వివాహ వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story