Medaram Jatara 2026: మేడారం క్యూ లైన్లలో తొక్కిసలాట.. మహిళకు గాయాలు

by Bhoopathi Nagaiah |

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం భక్తుల రద్దీతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది.

Medaram Jatara 2026: మేడారం క్యూ లైన్లలో తొక్కిసలాట.. మహిళకు గాయాలు
X

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం భక్తుల రద్దీతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. దర్శన క్యూ లైన్లలో తోపులాట జరగడంతో పలువురు మహిళలు, వృద్ధులు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడే ఉన్న ఎన్ఎస్ఎస్ వలంటీర్ స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు కన్నీటి పర్యంతరమయ్యారు. దర్శనానికి సమీప ప్రాంతాల్లో దుకాణాల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story