మోసం చేశాడని మహిళ కన్నీటిపర్యంతం.. మరో జనసేన జడ్పీటీసీ పేరు తెరపైకి

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-09 05:08:22  IST  )

పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నేత, వీరవాసరం ZPTC జయప్రకాశ్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

మోసం చేశాడని మహిళ కన్నీటిపర్యంతం.. మరో జనసేన జడ్పీటీసీ పేరు తెరపైకి
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) వ్యవహారం మరువక ముందే జనసేన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా మరో నేత తీరు హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ (ZPTC), జనసేన నాయకుడు జయప్రకాష్ నాయుడు (Jayaprakash Naidu) తనను తీవ్రంగా మోసం చేశారంటూ ఓ మహిళా బాధితురాలు మీడియా ముందుకు వచ్చారు. ఆయన వల్ల తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఆమె విడుదల చేసిన వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధిత మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకున్నారని ఆరోపించారు. నమ్మించి అన్ని రకాలుగా తనను ఉపయోగించుకుని, తీరా ఇప్పుడు తనను నట్టేట ముంచారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కేవలం తన అవసరాల కోసమే తనను వినియోగించుకున్నారని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు.

ప్రస్తుతం ప్రాణహాని.. వేధింపులు

జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడమే కాకుండా, ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తనను వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. వీడియో (Video)లో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. బాధితురాలు మీడియా మందుకు వచ్చిన తరుణంలో ఈ వ్యవహరాంపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాధిత మహిళ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story