చిరునవ్వుల మధ్య చేదు నిజం: ఫొటో దిగుతూ కుప్పకూలిన మహిళ!

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-16 15:02:42  IST  )

ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

చిరునవ్వుల మధ్య చేదు నిజం: ఫొటో దిగుతూ కుప్పకూలిన మహిళ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గృహ ప్రవేశం వేళ సందడిగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని 3 టౌన్ ప్రాంతనికి చెందిన సుస్మిత అనే మహిళ బంధువుల గృహప్రవేశ వేడుకకు వెళ్లింది. ఫొటో దిగే సమయంలో గుండెపోటు రావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. చలాకీగా ఉన్న యువతి ఒక్కసారిగా మృతి చెందడం గృహ ప్రవేశానికి వచ్చిన బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేసింది. సందడిగా జరుగుతున్న ఫంక్షన్​ ఒక్కసారిగా విషాదమయంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. యువకుల దగ్గరి నుంచి వృద్ధుల వరకు గుండెపోటుతో కుప్పకూలి చనిపోతున్న వారి సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. వీడియో

Next Story