వీధి కుక్కలకు ఆహారం పెడుతోందని బెదిరింపులు! లైజాల్ తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

by Ramesh Naini |

కేవలం వీధి కుక్కలకు ఆహారం పెడుతోందన్న కారణంతో కాలనీవాసులు వేధించడంతో, ఓ మహిళ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ శివారులోని అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

వీధి కుక్కలకు ఆహారం పెడుతోందని బెదిరింపులు! లైజాల్ తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేవలం వీధి కుక్కలకు ఆహారం పెడుతోందన్న కారణంతో కాలనీవాసులు వేధించడంతో, ఓ మహిళ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ శివారులోని అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌ ప్రాంతంలో నివాసముంటున్న ప్రతిభ (36) అనే మహిళ, మానవతా దృక్పథంతో తరచూ స్థానికంగా ఉండే వీధి కుక్కలకు ఆహారం పెడుతుండేవారు. అయితే, ఇది నచ్చని కొందరు కాలనీవాసులు ఆమెపై కక్ష గట్టినట్లు తెలుస్తోంది. కుక్కలకు ఎందుకు ఆహారం పెడుతున్నావంటూ ఆమెను నిలదీయడమే కాకుండా, తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

కుక్కలకు ఆహారం వేస్తే ఎన్జీవో ద్వారా ఫిర్యాదు చేసి, ఇంటిని సీజ్ చేయిస్తామంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఈ బెదిరింపులతో తీవ్ర ఆందోళనకు, భయానికి లోనైన ప్రతిభ.. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న లైజాల్ (ఫ్లోర్ క్లీనర్) తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

Next Story