- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD మెట్రోలో జర్నలిస్టులకు ఫ్రీ జర్నీ కల్పించండి.. గవర్నర్‌కు వినతి
HYD మెట్రోలో జర్నలిస్టులకు ఫ్రీ జర్నీ కల్పించండి.. గవర్నర్‌కు వినతి

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రిడికేషన్లు, హెల్త్‌కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ కోరింది. ఇవాళ ఆ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి ప్రమోద్‌కుమార్, కప్పర ప్రసాద్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం లోకభవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. జర్నలిస్టుల అక్రిడికేషన్ల ప్రక్రియలో రెండేళ్లుగా జరుగుతున్న జాప్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్‌లలో ఎలక్ట్రానిక్, డిజిటల్, వెబ్ మీడియాకు అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపింది. తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ పాలసీలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు డిజిటల్, వెబ్ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని కోరింది. ఆరోగ్య బీమా అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ జర్నలిస్టులకు శాపంగా పరిణమించిందని, అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం హెల్త్‌కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని యూనియన్ నేతలు కోరారు. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యలు ఏళ్ల తరబడి కొలిక్కిరాకపోవడం వల్ల సొంతింటి కల నెరవేరడం లేదని, ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వానికి సూచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
మెట్రోలో ఫ్రీ జర్నీ కల్పించండి
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు మెట్రో రైల్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని గవర్నర్‌ను డబ్ల్యూజేఐ నేతలు కోరారు. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద జర్నలిస్టులకు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో స్థానిక దినపత్రికల మనుగడ కోసం సమాచార శాఖ కార్యాలయంలో ఎన్‌ప్యానల్‌మెంట్ వేగవంతం చేయాలని, అర్హత గల పత్రికలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్ కార్డు పెంచాలని కోరారు.






