- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCU నుంచి పోలీసు బలగాల ఉపసంహరణ
కంచ గచ్చిబౌలి భూవివాదం(Kancha Gachibouli Land Issue)పై ప్రభుత్వం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ వెబ్ డెస్క్ : కంచ గచ్చిబౌలి భూవివాదం(Kancha Gachibouli Land Issue)పై ప్రభుత్వం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంలో అరెస్టైన విద్యార్థులను(Studnets Release) విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపట్లోనే హెచ్సీయూ నుంచి పోలీసులు బలగాలను ఉపసంహరించుకుంది. సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), మంత్రుల కమిటీతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజా సంఘాల ప్రతినిధుల బృందం నిర్వహించిన భేటీలో డిప్యూటీ సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పౌర సంఘాలు, ఉపాధ్యాయ జెఎసి క్యాంపస్ లో ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరించాలని, నిషేధాజ్ఞలు తొలగించాలని, అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్లు మంత్రుల కమిటీ ముందు ఉంచగా.. విద్యార్థుల కేసులను ఉపసంహరించుకుంది మంత్రుల కమిటీ. అదే విధంగా.. హెచ్సీయూ నుంచి పోలీసు బలగాలను రీకాల్ చేసింది. అయితే క్యాంపస్ లో స్వీయ భద్రతా చర్యలు తీసుకోవాలని, ఇకపై ఆ బాధ్యత అంతా వర్శిటీదే అంటూ వీసీకి భట్టి లేఖ రాశారు. అలాగే 400 ఎకరాల్లో నష్టం అంచనాకు, జీవ వైవిధ్య సర్వేకు పౌర సంఘాలు అనుమతి కోరగా.. కోర్టు తీర్పు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలాంటి సర్వేకు అనుమతి ఇవ్వలేమని భట్టి విక్రమార్క తెలియజేశారు.






