- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాపులు బంద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు (ఆదివారం) జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. నగరంలోని

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు (ఆదివారం) జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. నగరంలోని వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్యా తెలిపారు. ఈ మేరకు వైన్ షాపు యాజమానులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు హైదరాబాద్ జిల్లాలో జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వైన్ షాపులు బంద్ అవుతాయనే వార్త తెలియడంతో మందుబాబులు వైన్స్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు.
Next Story






