ఇల్లు అద్దెకు ఇస్తారా..! మహిళకు టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు

by Ramesh Goud |

ఇళ్లు అద్దెకు కావాలని చెప్పి సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ఓ మహళకు టోకరా వేశారు.

ఇల్లు అద్దెకు ఇస్తారా..! మహిళకు టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఇళ్లు అద్దెకు కావాలని చెప్పి సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ఓ మహళకు టోకరా వేశారు. ఆర్మీ చెల్లింపులు రివర్స్ మోడ్ (Riverse Payment Mode) లో ఉంటాయని చెప్పి ఆ మహిళ నుంచి దాదాపు లక్షన్నర లూటీ చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలో జరిగింది. సైబర్ మోసాలపై ప్రజల్లో ఎంతగా అవగాహన కల్పించినా సైబర్ నేరాలు (Cyber Crimes) మాత్రం ఆగడం లేదు. అమాయక ప్రజల నుంచి డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పద్దతులు ఎంచుకొని మరీ మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో నూతన పద్దతితో ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బు లాగేస్తున్నారు. రివర్స్ పేమెంట్ మోడ్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి చేదు అనుభవమే సికింద్రాబాద్ లో ఓ మహిళకు ఎదురైంది. వివరాల ప్రకారం సికింద్రాబాద్ కు చెందిన ఓ మహిళ ఫ్లాట్ అద్దెకు ఇస్తామని ఆన్‌లైన్ లో వివరాలు పెట్టింది. ఈ వివరాలు చూసిన సైబర్ నేరగాళ్లు ఆ మహిళకు ఫోన్ చేశారు. తాను ఆర్మీ అధికారినని ఇల్లు అద్దెకు కావాలని చెప్పి మహిళను నమ్మించాడు. ఫ్లాట్ అద్దెకు తీసుకునేందుకు అడ్వాన్స్ డబ్బు పంపిస్తానని చెప్పాడు. ఆర్మీ చెల్లింపులు రివర్స్ మోడ్ లో ఉంటాయని మహిళను చెప్పి నమ్మించాడు. మోసగాడి మాయమాటలు నమ్మిన మహిళ అకౌంట్ కి రూ. లక్షా 31 వేలు పంపింది. డబ్బు చేరిన తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ వెంటనే సీసీఎస్ లో ఫిర్యాదు చేసింది.

Next Story