- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రమంత్రి అయ్యుండి ఇది కూడా రాజకీయం చేస్తారా?.. కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
శాంతి భద్రతల దృష్ట్యా తీసుకున్న చర్యలను కూడా రాజకీయం చేస్తారా కిషన్ రెడ్డి అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు (Bhuvanagiri MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: శాంతి భద్రతల దృష్ట్యా తీసుకున్న చర్యలను కూడా రాజకీయం చేస్తారా కిషన్ రెడ్డి అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు (Bhuvanagiri MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ట్విట్టర్ (Twitter) వేదికగా వీడియో విడుదల (Video Released) చేశాడు. ఇందులో ఆయన.. కిషన్ రెడ్డి బాధ్యత గల కేంద్రమంత్రి పదవిలో (Union Minister Post) ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. కిషన్ రెడ్డి తీరు చూస్తుంటే వ్యవహార శైలిలో ఆయన సహచర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) బాటలో నడుస్తున్నట్లుగా అనిపిస్తుందని అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో భారత్ (India) విజేతగా నిలవడం పట్ల దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ (Hyderabad)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు (Cricket Fans) సంబరాలు చేసుకున్నారు. ట్యాంక్ బండ్ (Tank Bund) పై కూడా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ ఒక్క దిల్‌సుఖ్ నగర్ (Dilsuk Nagar) ప్రాంతంలో శాంతి భద్రత దృష్ట్యా పోలీసులు (Police) తీసుకున్న చర్యలను తప్పు పడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి (State Government) ఇండియన్ టీం (Indian Team) కప్పు గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) దుష్ప్రచారం చేయడాన్ని తప్పుపడుతున్నానని అన్నారు.
మీరంటే మాకు చాలా గౌరవం ఉందని, కానీ చిల్లర మల్లర విషయాలలో రాజకీయం చేసి, వాస్తవాలు కాని వాటిని మాట్లాడటాన్ని తప్పుపడుతున్నామని, దయచేసి ఇలాంటివి మానుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి, కాంగ్రెస్ ఎంపీ సూచించారు. కాగా దిల్ సుఖ్ నగర్ లో జరిగిన లాఠీ చార్జీ ఘటనపై కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎలా ఉందో చూడండి.. తెలంగాణలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయోత్సవ వేడుకలను అనుమతించడం లేదని రాసుకొచ్చారు.






