- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూగుల్ రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయా? తెలంగాణ పోలీసులు ఏం చెబుతున్నారంటే?
గూగుల్‌లో వెబ్‌సైట్లకు రివ్యూలు ఇస్తే వేల రూపాయలు సంపాదించవచ్చంటూ వస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : గూగుల్‌లో వెబ్‌సైట్లకు రివ్యూలు ఇస్తే వేల రూపాయలు సంపాదించవచ్చంటూ వస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. పార్ట్‌టైమ్ జాబ్స్ పేరిట వాట్సాప్, మెసేజ్‌ల ద్వారా వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. ఇంట్లో ఉంటూనే సులభంగా డబ్బులు సంపాదించవచ్చన్న ఆశ చూపిస్తూ మోసగాళ్లు వల వేస్తున్నారని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ‘క్యాప్యావర్క్’ వంటి వెబ్‌సైట్ రివ్యూల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, మొదట చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మకం కలిగించి, తర్వాత పెద్ద మొత్తాలు కాజేస్తున్నారని పేర్కొన్నారు.
పార్ట్‌టైమ్ ప్రకటనలకు దూరంగా ఉండాలి!
ప్రజల అవసరాలు, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని, అందువల్ల అనుమానాస్పద లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగ ప్రకటనలకు దూరంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ పోలీసులు అవగాహన ట్వీట్ విడుదల చేస్తూ, Part Time Job Scams పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గూగుల్ రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయా? అని ప్రశ్నించారు. ఏదైనా అనుమానాస్పద ఆఫర్లు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.






